Newdelhi, Dec 12: మొక్కల (Plants) మధ్య జీవనం సాగించే వారి వయసులో ప్రత్యేక మార్పులను గుర్తించినట్టు నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. చెట్ల (Trees) మధ్య జీవనం సాగించే వారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ (Oxygen) తగినంతగా అందుబాటులో ఉంటుందని, దీంతో కణాల్లో జీవక్రియ మెరుగ్గా ఉండి వాటి జీవితకాలం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఫలితంగా ఏండ్లు గడిచినప్పటికీ వారిలో వయసు మాత్రం పెరిగినట్టు కనిపించదని తెలిపారు. 7,827 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు వివరించారు. కాగా, పరిసర ప్రాంతాల్లో పచ్చదనంతో మానసిక ఉల్లాసం, రోగనిరోధక శక్తి మెరుగుపడటం, గుండె జబ్బులు దూరమవుతాయన్న సంగతి ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా వెల్లడైంది.
Cells of people living in greener areas age more slowly, research finds https://t.co/ZcdY2OHkab
— Guardian Environment (@guardianeco) December 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)