భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వేత్తలో ఒకరైన టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని, ముంబై ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని రాయిటర్స్ సంస్థ రిపోర్ట్ చేసింది. 86 ఏళ్ల రతన్ టాటా అక్టోబర్ 7 సోమవారం రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం. అయితే ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ వార్తను పుకారుగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన ప్రజలకు మరియు మీడియాకు విజ్ఞప్తి చేశారు. టాటా రక్తపోటు తగ్గడంతో సోమవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రాయిటర్స్ సంస్థ తెలపడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
#NewsAlert | #RatanTata in critical condition at Mumbai hospital
Read here: https://t.co/vOfazAO2wL pic.twitter.com/LRs7qwFrFu
— Mint (@livemint) October 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)