Medak Horror: మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)

ఇదీ అలాంటి ఘటనే. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది.

Crime Representational Image (File Photo)

Medak, Oct 4: శాస్త్ర సాంకేతికత ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు పెద్దయెత్తున రాజ్యమేలుతున్నాయి. ఇదీ అలాంటి ఘటనే. మెదక్ (Medak) జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తున్నదన్న (black magic) అనుమానంతో గ్రామానికి చెందిన డేగల ముత్తవ్వ అనే మహిళపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పరిస్థితిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని సమీప దవాఖానకు తరలించారు.

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు

ముగ్గురు అదుపులోకి

అయితే, అప్పటికే మహిళ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించారు. అయితే, దారిమధ్యలో ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్తా స్థానికంగా సంచలనంగా మారింది.

దేశంలో రైతుల కోసం కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు, రెండు ప‌థ‌కాల కోసం ఏకంగా ల‌క్ష కోట్ల‌కు పైగా ఖ‌ర్చు, ఆహార భ‌ద్ర‌త కొన‌సాగించేందుకు నిర్ణ‌యాలు