KTR Tweet on Congress: బెంగళూరులో పట్టుబడ్డ రూ. 42 కోట్లపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, అవన్నీ తెలంగాణకు పంపేందుకు దాచినవే అంటూ పోస్ట్, తెలంగాణలో స్కామ్‌ గ్రెస్‌ కు చోటు లేదన్న కేటీఆర్

అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ (BRS) అఫీషియల్‌ అకౌంట్‌ నుంచి చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌నూ రీట్వీట్ చేశారు.

KTR Tweet on IT Raids (PIC@ FB KTR)

Hyderabad, OCT 13: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఓట్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలు పంపిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో నాడు లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన నేటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఇప్పుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, ఇది ఊహించిందేనని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 'స్కామ్ గ్రెస్'కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్‌ లో మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ (BRS) అఫీషియల్‌ అకౌంట్‌ నుంచి చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌నూ రీట్వీట్ చేశారు.

 

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (IT Raids) అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కిస్తే.. రూ.42 కోట్లుగా (Rs. 42 Crore) తేలింది అది. ఈ డబ్బు వ్యవహారానికి సంబంధించి.. స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్‌, ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం.

Telangana Assembly Elections 2023: తెలంగాణాలో కొత్తగా నియమితులైన ఎస్పీలు, కమిషనర్ల లిస్ట్ ఇదిగో, పెండింగ్‌లో హైదరాబాద్‌ సీపీ పోస్ట్  

ఈ మొత్తాన్ని రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఇవాళ బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు. ఆర్టీ నగర్‌లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్‌లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం రూ.42 కోట్లని తేలింది. ఈ ఫ్లాట్‌ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ నివసించట్లేదని సమాచారం. ఈ ఫ్లాట్‌ యజమాని ఎవరన్నది ఐటీ అధికారులు వెల్లడించలేదు. కాగా.. ఆ మాజీ కార్పొరేటర్‌ భర్త ఓ కాంట్రాక్టర్‌ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.