City Buses in TS: సిటీ బస్సులను ఇప్పట్లో నడపేది లేదు, క్లారిటీ ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటన
ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్యూలో ఇప్పట్లో సిటీ బస్సులు (City Buses) నడిపే ఆలోచన లేదని తెలిపారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సిటీ బస్సులు నడపకపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వస్తుందని అయినప్పటికీ కరోనావైరస్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్సులు ఇప్పట్లో నడిపే ఆలోచన ఏమీ లేదని తెలిపారు.
Hyderabad, June 5: ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోనూ సిటీ బస్సు సర్వీసులు (City Buses in TS) ప్రారంభం అవుతాయని అందరూ ఊహిస్తున్న తరుణంలో దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్యూలో ఇప్పట్లో సిటీ బస్సులు (City Buses) నడిపే ఆలోచన లేదని తెలిపారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సిటీ బస్సులు నడపకపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వస్తుందని అయినప్పటికీ కరోనావైరస్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్సులు ఇప్పట్లో నడిపే ఆలోచన ఏమీ లేదని తెలిపారు. తెలంగాణలో కొత్తగా మరో 127 పాజిటివ్ కేసులు నమోదు, 3147కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 100 దాటిన కరోనా మరణాలు
కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో గత 70 రోజులుగా సిటీ బస్సులు రోడ్డెక్కని విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay Kumar) బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు ఏ విధంగా నడపాలనే దానిపై చర్చించారు. అయితే బస్సులు నడపకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.
ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. సిటీలో బస్సు సర్వీసులు లేకపోవటంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది.