Sircilla Woman kidnap Case: ఆ యువతి కిడ్నాప్ అంతా నాటకం, పెళ్లి కోసమే ఇదంతా చేసింది, పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలు, వీడియోను విడుదల చేసిన రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాపైన యువతి

ఆ యువతి తాజాగా పెళ్లి ఫోటోలను విడుదల చేసింది. తాను జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

Minor girl kidnapped in Rajanna-Sircilla 1 (Photo-Video Grab)

Hyd, Dec 20: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్‌ కేసులో (Minor girl kidnap Case) భారీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆ యువతి తాజాగా పెళ్లి ఫోటోలను విడుదల చేసింది. తాను జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని (She claimed that no one kidnapped her ) ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లిపోయినట్లు పేర్కొంది.ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలను, వీడియో విడుదల చేసింది.

తెలంగాణలో మరో యువతి కిడ్నాప్, గుడికి వెళ్లిన యువతిని కారులో కిడ్నాప్ చేసిన నలుగురు అగంతకులు, తండ్రిని కొట్టి అతని ముందే ఎత్తుకెళ్లిన వైనం, రాజన్న సిరిజిల్లాలో ఘటన

‘జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లా. రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్నా. నా తల్లిదండ్రుల నుంచి ప్రాణహానీ ఉంది’ అని వీడియోలో తెలిపింది. కాగా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో శాలిని అనే యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. శాలినికి సోమవారమే ఎంగేజ్‌మెంట్ అవ్వగా .. మంగళవారం తెల్లవారుజామున తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసేందుకు వెళ్లిన శాలిని గుడి ముందే నలుగురు యువకులు అపహరించారు.

యూపీలో దారుణం, ఊర్లో గొడవలు పడుతున్నాడని కొడుకును చంపేసిన తండ్రి, శవాన్ని వ్యవసాయ క్షేత్రంలో పూడ్చిపెట్టి పరార్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

అడ్డుకున్న యువతి తండ్రిని కొట్టి ఆమెను లాక్కెళ్లారు. యువతి కిడ్నాప్‌ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటి వరకు యువతిని కిడ్నాప్‌ చేశారని అంతా భావిస్తుండగా.. తానే స్వయంగా అతనితో వెళ్లిన్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది.