Nagarjuna Sagar Dam: నిండుకుండలా నాగార్జున సాగర్, మళ్లీ రెండు గేట్లు ఎత్తిన అధికారులు, లాంగ్ వీకెండ్ తో క్యూకట్టిన పర్యాటకులు
ఇటీవల భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న ది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను (Gates Lifted) ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Nagarjuna Sagar, AUG 14: నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Dam) నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న ది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను (Gates Lifted) ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. అదేస్థాయినీటిలో నీటిమట్టం ఉన్నది. ప్రస్తుత, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 46,679 క్యూసెక్కులుగా ఉన్నది.
ఇదిలా ఉండగా.. గత సోమవారం వరకు 18 సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన విషయం తెలిసిందే. ప్రవాహం తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేసి.. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపారు. తాజాగా డ్యామ్ నీటిమట్టం గరిష్ఠానికి పైనుంచి వస్తున్న నీటిని.. అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఇవాల్టి నుంచి లాంగ్ వీకెండ్ ఉండటంతో నాగార్జున సాగర్ కు పర్యాటకులు పోటెత్తారు. మొన్నటి వరకు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తిన అధికారులు, ఇప్పుడు ఫ్లో కు అనుగుణంగా రెండు గేట్ల ద్వారా నీటిని వదలుతున్నారు.