Hyd, Aug 14: హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ ప్రయాణీకుల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టికెట్ రేట్‌తో సమానంగా పార్కింగ్ ఛార్జీలు ఏంటని మండిపడుతున్నారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాల్సిందేనని మెట్రో సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉంది.
Here's Video:
🚨 Breaking: Nagole Metro Station has removed free parking, causing commuter outrage! Charges now range from ₹10 for 2 hours of bike parking to ₹120 for 12 hours of car parking. Payments through “Park Hyderabad” app, which is unavailable on Google Play Store.🚗#HyderabadMetro pic.twitter.com/fPDMlemMMJ
— Hyderabad Mail (@Hyderabad_Mail) August 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)