Telangana New Secretariat: సచివాలయంలో మందిరం, మసీదు, చర్చి, ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, కొత్త సెక్రటేరియట్‌లో ప్రార్థనామందిరాల నిర్మాణంపై సమీక్ష
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం కొత్త సెక్రటేరియట్‌లో (New Secretariat design) ప్రార్థనామందిరాల నిర్మా ణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. వారినుంచి అభిప్రాయాలు సూచనలు తీసుకొన్నారు.
Hyderabad, Sep 6: తెలంగాణలో కొత్తగా నిర్మించే సచివాలయంలో (Telangana New Secretariat) మందిరం, మసీదు, చర్చిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం కొత్త సెక్రటేరియట్‌లో (New Secretariat design) ప్రార్థనామందిరాల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. వారినుంచి అభిప్రాయాలు సూచనలు తీసుకొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్ అని అన్నారు. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని (Temple, Mosques, Church) ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు. కాగా కొత్త సచివాలయ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయ భవనాలను కూల్చివేసింది.
ఈ సందర్భంగా అక్కుడున్న ఆలయానికి, రెండు మసీదులకు నష్టం వాటిల్లింది. దీంతో వాటి స్థానంలో ప్రభుత్వ ఖర్చుతో కొత్త ప్రార్థనా మందిరాలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. మసీదుల నిర్మాణంపై ముస్లిం మత పెద్దల అభిప్రాయాలను తీసుకున్నారు.
750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్ తో సహా రెండు మసీదులను నిర్మిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణం పూర్తయ్యాక ఆ మసీదులను వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తామన్నారు. అటు కొత్త దేవాలయాన్ని 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆ ఆలయ బాధ్యతలను దేవాదాయ శాఖకు అప్పగించనుంది.
ఇక క్రిస్టియన్ల కోరిక మేరకు సచివాలయంలో చర్చిని కూడా నిర్మిస్తామని సీఎం తెలిపారు. మసీదు, చర్చి. గుడికి ఒకే రోజు శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముస్లింల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ముస్లిం పెద్దలకు వివరించారు సీఎం కేసీఆర్. ముస్లిం అనాథ పిల్లల కోసం నిర్మిస్తున్న అనీస్ -ఉల్ -గుర్భా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైననిధులు కేటాయిస్తామన్నారు. ఖబ్రస్థాన్ లు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు.
స్మశానవాటికల కోసం స్థలాలు సేకరించాలని ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను కోరామని కేసీఆర్ తెలిపారు.మొత్తంగా 150 నుంచి 200 ఎకరాల్లో ఖబ్రస్థాన్‌లను ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. నారాయణపేటలో రోడ్ల వెడల్పు సందర్భంగా పీరీల చావడికి నష్టం వాటిల్లిందని, స్థలం కేటాయించి నిర్మించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తున్నామని తెలిపారు. ఉర్దూ పరిరక్షణ, అభివృద్ధికోసం కార్యక్రమాలను చేపడతామన్నారు. అధికారభాషా సంఘంలో