IAS Transfers in TG: తెలంగాణ‌లో 9 మంది ఐఏఎస్ ల బ‌దిలీ, ప‌లువురికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గింత‌, కీల‌క శాఖ‌ల్లో ఐఏఎస్ ల మార్పు

ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi kumari) ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ డైరెక్టర్‌గా కే సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.

Telangana government transfers 8 IAS officers(X)

Hyderabad, AUG 31: భూసేకరణ, పునరావాస కమిషనర్‌గా టీ వినయ్‌ కృష్ణారెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయేషా మస్రత్‌ ఖానంను బదిలీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా తఫ్సీర్‌ ఇక్బాల్‌, మైనారిటీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా షేక్‌ యాస్మిన్‌ బాషాకు అదనపు బాధ్యతలు ఇచ్చింది.

Hyderabad Rains: హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం 

మైనారిటీ ఆర్థిక సంస్థ ఎండీగా నిర్మలా కాంతి వెస్లీకి అదనపు బాధ్యతలు ఇవ్వగా.. వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవోగా మహ్మద్‌ అసదుల్లా నియామకమయ్యారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా జీ మల్సూర్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పీ శ్రీజను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.