Nirmala Sitharaman Fires on Collector: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నిర్మలా సీతారామన్ క్లాస్, రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంతో చెప్పలేకపోయిన కలెక్టర్, ప్రధాని ఫ్లెక్సీ పెట్టాల్సిందే! అంటూ కలెక్టర్‌కు కేంద్రమంత్రి ఆదేశం

మంత్రి నిర్మల హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నవేయటంతో కలెక్టర్ జితేష్ (Collector Jithesh) షాక్ అయ్యారు. సమాధానం చెప్పటంలో తెలియదు అన్నట్లుగా నీళ్లు నమిలారు. కలెక్టర్ తీరుపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Nirmala Sitharaman (Photo Credits: ANI)

Kamareddy, SEP 02: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) పర్యటన కాకరేపుతోంది. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో (Kamareddy) మంత్రి నిర్మలమ్మ (nirmala sitharaman) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బిక్నూర్ లో రేషన్ షాపును (Ration Shop) మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ని నిలదీశారామె. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని ప్రశ్నించారు. మంత్రి నిర్మల హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నవేయటంతో కలెక్టర్ జితేష్ (Collector Jithesh) షాక్ అయ్యారు. సమాధానం చెప్పటంలో తెలియదు అన్నట్లుగా నీళ్లు నమిలారు. కలెక్టర్ తీరుపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఈ పాటి లెక్క కూడా తెలియదా? ఇటువంటివి తెలియకుండానే జిల్లాకు కలెక్టర్ గా ఎలా పనిచేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా కలెక్టర్ కు చుక్కలు చూపించారు మంత్రి.

ఈ లెక్క తెలుసుకోవటానికి మీకు అరగంట సమయం ఇస్తున్నానని… తెలుసుకుని చెప్పాలని ఆర్డర్ వేశారు. దీంతో కలెక్టర్ కు దిమ్మ తిరిగిపోయింది. అక్కడితో ఊరుకోలేదు మంత్రిగారు. రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో (Modi Photo)లేకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని… అలాంటప్పుడు ప్రధాని ఫొటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు.

Telangana: తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల, పార్టీ బ‌లోపేతంపై జ‌హీరాబాద్ పార్ల‌మెంటు నియోజక వర్గ నేతలతో భేటీ 

రేషన్ షాపుల వద్ద మోదీ ఫొటో పెట్టాలని… లేకపోతే తానే వచ్చి పెడతానని హెచ్చరించారు. ప్రధాని ఫోటోలను ఎవ్వరు తొలగించకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ దేనని నిర్మల తేల్చి చెప్పారు. రేషన్ బియ్యంపై (Ration Rice) కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 30 రూపాయలు భరిస్తోందని..రాష్ట్రం కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఇస్తోంది అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.

UTS System in APSRTC: ఇకపై యూపీఐ ద్వారా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనొచ్చు, సరికొత్త యాప్‌పై దృష్టి పెట్టిన ఏపీఎస్‌ఆర్టీసీ, బస్సుల్లో ఇకపై పేపర్‌లెస్ టికెటింగ్‌పై ప్రత్యేక దృష్టి 

దేశ ప్రధాని పేద ప్రజల కడుపు నింపటం కోసం ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా పెట్టుకుని రాష్ట్రానికి బియ్యం సరఫరా చేస్తుంటే ప్రధాని మోడీ ఫోటో పెట్టలేదు..ఫోటో పెట్టవద్దని ఎవరన్నా అభ్యంతరం చెబుతున్నారా? ఫ్రీగా కేంద్రం ఇస్తుంటో ఆ మహానాయకుడి పెట్టటానికి ఏమిటి మీకు అభ్యంతరం అంటూ కలెక్టర్ పై అంతెత్తున ఎగరిపడ్డారు మంత్రి నిర్మలా సీతారామన్. మా వాళ్లు (బీజేపీ నాయకులు) ప్రధాని మోడీ ఫోటో తీసుకొచ్చి పెడతారు..ఇకపై ఆ ఫోటోని ఎవ్వరు తొలగించానికివ వీల్లేదు..తొలగించకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ దే నంటూ స్పష్టంచేశారు మంత్రి.