Pochamma Temple Vandalized: హైదరాబాద్ మీర్ పేట లో పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం.. దుండగుడిని చితకబాదిన స్థానికులు (వీడియో)
హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది.
Hyderabad, Oct 19: ఆందోళన కలిగించేలా ఆలయాల ధ్వంసరచన (Temples Vandalized) కొనసాగుతున్నది. హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి సమయంలో పోచమ్మ తల్లి (Pochamma Temple Vandalized) ఆలయంలో శిఖరాన్ని ధ్వంసం చేసిన సదరు దుండగుడు హుండీలో ఉన్న డబ్బులను చోరీ చేసేందుకు యత్నించాడు.
Here's Video:
చప్పుడు రావడంతో..
అయితే, ఆలయంలో నుంచి చప్పుడు పెద్దయెత్తున రావడంతో స్థానికులు ఏమిటా? అని ఆరా తీశారు. ఆలయంలో దారుణానికి పాల్పడుతున్న యువకుడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని అప్పగించారు.