SI, Constable Physical Tests: ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల తేదీలు విడుదల, డిసెంబర్ 8 నుంచి టెస్టులు నిర్వహించనున్నట్లు ప్రకటన, ఏయే ప్రాంతాల్లో టెస్టులు ఉంటాయో తెలుసా?

డిసెంబర్‌8వ తేదీ నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌ (PMT), ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది.

TS police Logo

Hyderabad, NOV 27: పోలీస్‌ నియామక ప్రక్రియలో (Police recrutment) అత్యంత కీలకమైన ఫిజికల్‌ టెస్టులకు (Physical Measurement Tests) రంగం సిద్ధమైంది. డిసెంబర్‌8వ తేదీ నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌ (PMT), ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ ప్రక్రియను 23 నుంచి 25 పని దినాల్లో పూర్తి చేస్తామని పేర్కొంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in ద్వారా అడ్మిట్‌ కార్డులను (Admit cards) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కానట్లైతే అభ్యర్థులు.. support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని లేదా 93937 11110, 93910 05006 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

Hyderabad Metro: డిసెంబ‌ర్ 9న సీఎం కెసిఆర్ శంషాబాద్, మైండ్ స్పేస్ వరకూ సెకండ్ ఫేజ్ మెట్రో రైలుకు శంకుస్థాప‌న 

వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు కలిపి పీఎంటీ, పీఈటీల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్‌-2 దరఖాస్తును అందజేశారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. ఒకసారి తీసిన రీడింగ్‌లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో ఈవెంట్స్‌ నిర్వహించనున్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా ఫిజికల్ టెస్టులు (Physical Measurement Tests) నిర్వహించనున్నారు.

TS Police Recruitment 2022: తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభవార్త, రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఖాళీగా ఉన్న 16,027 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 

పోలీస్‌ నియమాక ప్రక్రియలో వీలైనంత వరకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేసేలా ఈ సారి ఫిజికల్‌ ఈవెంట్స్‌లో కూడా సాంకేతికతను వినియోగించనున్నారు. బయోమెట్రిక్‌ పరికరాలు, ఎత్తును కొలిచే డిజిటల్‌ మీటర్లు, సీసీటీవీ కెమెరాలు సహా ఇతర సాంకేతిక సామగ్రిని ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహణ తేదీకి వారం ముందే అన్ని కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి పనితీరు సంతృప్తికరంగా ఉందా లేదా అన్నది ముందుగానే నిర్ధారించుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.



సంబంధిత వార్తలు