Hyderabad Metro: డిసెంబ‌ర్ 9న సీఎం కెసిఆర్ శంషాబాద్, మైండ్ స్పేస్ వరకూ సెకండ్ ఫేజ్ మెట్రో రైలుకు శంకుస్థాప‌న
Hyderabad Metro - CM KCR | File Photo

మెట్రో రెండో ఫేజ్ ప‌నుల‌కు సంబంధించి సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారని రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మల శాఖ కెటిఆర్ పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారని తెలిపారు. దీంతో మైండ్ స్పేస్ జంక్ష‌న్ నుంచి శంషాబాద్ వ‌ర‌కు మెట్రో సేవలు విస్త‌రించ‌నున్నాయి. 31 కిలోమీట‌ర్ల చేప‌ట్టే ఈ ప‌నుల‌ను రూ. 6,250 కోట్ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్నారు.

డిసెంబ‌ర్ 9న ముఖ్యమత్రి కెసిఆర్ సెకండ్ ఫేజ్ మెట్రోకి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ వివరాలను మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం ప్ర‌క‌టించారు.