PM Modi Hyderabad Visit: ఏప్రిల్ 8న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం.. జింఖానా గ్రౌండ్స్ లో బహిరంగ సభ!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
Hyderabad, March 27: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఏప్రిల్ 8న హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు (Vande Bharat Train) పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ఓ వందేభారత్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు వస్తోంది. కాగా, ఈ రైలు ఆగే స్టేషన్లు, సమయాలు, చార్జీల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
జింఖానా గ్రౌండ్స్ లో బహిరంగ సభ?
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై హైదరాబాద్ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో బహిరంగ సభ జరగనుందని సమాచారం. ఈ సభకు పెద్దఎత్తున జన సమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.