Newdelhi, March 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) తనపై ఈడీ (ED) విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణకు రానుంది. ఇప్పటికే కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వనుంది. కవిత పిటిషన్ నెంబర్ 36 గా లిస్ట్ అయ్యింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది కవిత విజ్ఞప్తి. ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. మరి దీనిపై సుప్రీం ఎలా స్పందిస్తుంది? విచారణపై స్టే విధిస్తుందా? లేక దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నో చెబుతుందా ? లేక మహిళ అన్న కోణంలో ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తో పాటు పలు కీలక కేసుల విచారణ చేపట్టనున్నారు. వివేకా హత్య కేసు, కృష్ణా నదీ నీటి వివాదం, ఒడిశా-ఏపీ పోలవరం కేసులను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత పిటిషన్.. ఇప్పటికే కవిత పిటిషన్‌పై కేవియట్ దాఖలు చేసిన ఈడీ#delhiliquorscam #kavitha #enforcementdirectorate
— NTV Breaking News (@NTVJustIn) March 27, 2023
ఇప్పటివరకూ ఏం జరిగిందంటే??
ఈనెల 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేయగా.. 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వచ్చింది. త్వరగా విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాదులు కోరగా.. ఈ నె ల27 జాబితాలో ఉందని కోర్టు స్పష్టం చేసింది. కాగా, కవితను ఈడీ అధికారులు ఇప్పటి వరకు మూడుసార్లు విచారించారు. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ సాగింది. మూడోరోజు విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ విచారణ ఉంటే మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్‌కు ఈడీ వివరించింది.