Game Changer (Credits: Twitter)

Hyderabad, March 27: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ15 (RC15) చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రానికి 'గేమ్ చేంజర్' (Game Changer) అనే టైటిల్ ను అనౌన్స్ చేసింది. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని దర్శకుడు శంకర్ బలంగా నమ్ముతున్నారు. టైటిల్ ద్వారానే హీరో పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో శంకర్ తనదైన శైలిలో చెప్పేశాడు. ప్రస్తుతం ఈ టైటిల్ పై మెగా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తున్నది.

Rains Alert In Telugu States: రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ.. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

భారీ తారాగణం..

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. సౌత్ లో తిరుగులేని డైరెక్టర్ గా కొనసాగుతున్న శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'గేమ్ చేంజర్' పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్, కియారాతో పాటు చిత్రంలో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితర భారీ తారాగణం కూడా నటిస్తున్నది. 'గేమ్ చేంజర్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Tirumala Special Darshan Tickets: ఏప్రిల్ నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల.. ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో.. ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ.. తిరుమలలో 30న శ్రీరామనవమి ఆస్థానం... 31న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు