Private Bus Fire: చూస్తుండగానే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు, జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఘటన, ప్రయాణికులంతా సురక్షితం

ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సులో (Kaveri Bus) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కావేరీ బస్సు కాలిపోయింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. మంటలను ఆర్పివేసింది.

Private bus goes up in flames (PIC @ Google)

Hyderabad, JAN 08: హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ (JNTU) వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సులో (Kaveri Bus) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కావేరీ బస్సు కాలిపోయింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. మంటలను ఆర్పివేసింది. ఈ మంటల్లో బస్సు పూర్తిగా (Bus Fire) కాలిపోయింది. అయితే, అందులో ఉన్న ప్రయాణికులు సేఫ్ గా కిందకు దిగేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయ్యి ఒకరికొకరు అందరూ కిందకు దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే.. మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు కాలిపోయింది.

Hyderabad Boy: ఆరేళ్ల బాలుడికి ఆరు నెలల్లో చనిపోతాను అని తెలిసి, తన తల్లిదండ్రులకు నిజం చెప్పొద్దని డాక్టరును వేడుకున్నాడు, హైదరాబాద్ లో హృదయవిదారక ఘటన.. 

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private bus) మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. అందులోని ప్రయాణికులు బస్సు దిగేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. కళ్ల ముందే బస్సులో మంటలు చెలరేగడం, చూస్తుండగా మంటలు ఎగసిపడటం, బస్సు మంటల్లో కాలిపోవడం… ప్రయాణికులను షాక్ కి గురి చేసింది. ఒకవేళ తాము బస్సులోనే చిక్కుపోయి ఉంటే.. ఆ ఊహే చాలా భయానకంగా ఉందంటున్నారు. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.