Rain in Hyderabad: హైదరాబాద్‌ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ

శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వాన పడుతున్నది. ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, మలక్‌ పేట, దిల్‌ సుఖ్‌ నగర్‌, హయత్‌ నగర్‌, వనస్థలిపురం, బంజారాహిల్స్‌, లక్డీక పూల్‌, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.

IMD Issues 4 Days Rain Alert To Telangana

Hyderabad, Aug 31: రాజధాని హైదరాబాద్‌ లో వర్షం (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వాన పడుతున్నది. ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, మలక్‌ పేట, దిల్‌ సుఖ్‌ నగర్‌, హయత్‌ నగర్‌, వనస్థలిపురం, బంజారాహిల్స్‌, లక్డీక పూల్‌, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్కూల్స్ (Schools), కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

పెంచిన పాశం ముందు కన్నపాశం అచ్చెరువొందిన వేళ.. కిడ్నాపర్ వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్లనని మారాం చేసిన రెండేండ్ల బాలుడు... కిడ్నాపర్‌ పై పెంచుకున్న మమకారమే కారణం.. ఇంటర్నెట్ ను కదిలిస్తున్న భావోద్వేగ వీడియో ఇదిగో మీరూ చూడండి!!

ఈ జిల్లాలకు అలర్ట్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రుం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ, లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి, హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి..