Telangana Rain Alert: తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్‌ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక

ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాలను వాన ముంచెత్తుతున్నది.

Hyderabad Vijayawada Highway is closed Due Heavy Floods (Photo-Video Grab)

Hyderabad, Sep 2: గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) తెలుగు రాష్ట్రాలను (Telugu States) అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీ (AP) సహా తెలంగాణలోని (Telangana) పలు జిల్లాలను వాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. నేడు కూడా రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద బీభ‌త్సంపై రంగ‌లోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా! ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తెలంగాణ‌కు ఏ సాయం కావాల‌న్నా చేస్తాన‌ని హామీ

అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో..

ఆదిలాబాద్‌, నిజామాబాద్, కామారెడ్డి

భారీ నుంచి తీవ్ర వర్షాలు ఈ జిల్లాల్లో..

మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

భారీ వ‌ర్షాల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మ‌హ‌బూబాబాద్ లో బీభ‌త్సం సృష్టిస్తున్న వ‌ర‌ద‌లు, ప‌లు రైళ్లు ఆల‌స్యం, దారి మ‌ళ్లింపు (వీడియో ఇదుగోండి) 

భారీ వర్షాలు ఈ జిల్లాల్లో..

నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ-గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి