CM KCR Rajshyamala Yagam: ఎన్నికల్లో గెలుపు కోసం సిఎం కేసీఆర్ యాగం, ఫామ్ హౌస్ లో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రాజా శ్యామల యాగం, ఇంతకీ ఈ యాగం ఎందుకు చేస్తారంటే?

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. బహుశా మూడో సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలనే సంకల్పంతో రాజశ్యామల, శత చండీ యాగం (Shatha Chandiyagam) చేయనున్నట్లుగా తెలుస్తోంది.

CM KCR Rajshyamala Yagam (PIC@ BRS X)

Hyderabad, NOV 01: మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. బహుశా మూడో సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలనే సంకల్పంతో రాజశ్యామల, శత చండీ యాగం (Shatha Chandiyagam) చేయనున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు సీఎం కేసీఆర్ యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగాపాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ తరచు యాగాలు నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. కీలక కార్యక్రమాల సందర్భంగా యాగాలు చేయిస్తుంటారు. సతీ సమేతంగా పాల్గొని నియమనిష్టలతో పూజలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో మరోసారి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో పలువురు పండితులతో ఐదు రోజుల పాటు రాజశ్యామల యాగం (Rajshyamala Yagam) నిర్వహించనున్నారు. అంతేకాదు యాగ నిర్వహణకు కర్ణాటక,ఆంద్రప్రదేశ్ నుండి దాదాపు 200 మందికి పైగా పురోహితులు హాజరుకానున్నారని సమాచారం.

Telangana Assembly Elections 2023: మొండి కత్తి మాకూ దొరకదా, చాతకాని ప్రతిపక్ష దద్దమ్మ పార్టీలు, వెదవలు కత్తులతో దాడికి పాల్పడుతున్నారు, సీఎం కేసీఆర్ ఫైర్ వీడియో ఇదిగో.. 

అధికారం సిద్ధించటానికి… శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం కూడా ఈ యాగం చేస్తారని పండితులు చెబుతుంటారు.ఈ యాగంలో భాగంగా మొదటి రోజున అంటే ఈరోజు సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ చేసి యాగ ప్రవేశం చేస్తారు. ఆ తరువాత శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం యాగం ఐదు రోజుల పాటు కొనసాగనుంది.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన తరువాత అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. దీని కోసం రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లుగా సమాచారం.



సంబంధిత వార్తలు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన