అతికష్టం మీద తెలంగాణను సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని, 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.బాన్సువాడలో సోమవారం బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మొండి కత్తి మాకూ దొరకదా అనిప్రశ్నించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్‌ మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)