Reduction In Liquor Prices: మందుబాబులకు గుడ్‌న్యూస్‌, లిక్కర్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం, దేనిపై ఎంతెంత తగ్గిందంటే?

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం( Liquor) ధరలను తగ్గిస్తూ ( Reduce prices) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది

Liquor Representative Image (Photo Credits: Wikimedia Commons)

Hyderabad, May 05: తెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం( Liquor) ధరలను తగ్గిస్తూ ( Reduce prices) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ధరలు తగ్గాయి. అయితే అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించిన ప్రభుత్వం.. బీర్ల ధరలు మాత్రం తగ్గించలేదు. అక్రమ మద్యం కట్టడిలో భాగంగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

TSPSC Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్టు 

తగ్గిన ధరలు ఇవి

90ml మీద 10 రూపాయలు తగ్గింపు

180ml (క్వార్టర్) మీద 10 రూపాయలు తగ్గింపు

375ml (హాఫ్) మీద 20 రూపాయలు తగ్గింపు

750ml (ఫుల్) మీద 40 రూపాయలు తగ్గింపు