IPL Auction 2025 Live

TS New CM Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి!.. నేడు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే

ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌ కు తెలియజేస్తారు.

Revanth Reddy TPCC (Photo-Video Grab)

Hyderabad, Dec 4: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (TS New CM Revanth Reddy) నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ (CLP) సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌ కు తెలియజేస్తారు. అయితే, పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది.

KCR Leaving Pragathi Bhavan: సామాన్యుడిలా ట్రాఫిక్‌ లో ఆగుతూ.. కాన్వాయ్, గన్‌ మెన్‌ లు లేకుండానే సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు పెద్ద సారు.. ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ ప్రగతిభవన్ ను ఎలా విడిచిపెట్టి వెళ్లారంటే??

ఎవరెవరు హాజరంటే?

ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది.

Mizoram Election Counting LIVE: మిజోరంలో కౌంటింగ్ ప్రారంభం.. ఎమ్ఎన్ఎఫ్, జెడ్‌పీఎమ్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ.. జెడ్‌పీఎమ్ క్లీన్ స్వీప్ చేయనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి