Suryapet Road Accident: అర్ధరాత్రి నెత్తురోడిన సూర్యాపేట.. మునగాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం.. అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరై వస్తుండగా.. రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ట్రాక్టర్.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మునగాల శివారులోని పెట్రోలు పంపు వద్ద గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిందీ ఘటన.

Accident (Credits: TelanganaToday)

Suryapet, Nov 13: సూర్యాపేట (Suryapet) జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మునగాల (Munagala) శివారులోని పెట్రోలు పంపు వద్ద గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి (Five Dead) చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాగర్ ఎడమ కాల్వ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో (Temple) గత రాత్రి మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మునగాల వాసులు కొందరు వెళ్లారు.

సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదు, తెలంగాణలో రూ.10వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని

పూజ అనంతరం ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాల బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్తుండగా, మునగాల శివారులోని పెట్రోలు బంకు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif