Attack on VJ Sunny: బిగ్ బాస్ విన్నర్‌పై రౌడీ షీటర్ దాడి, షూటింగ్ చేస్తుండగా హల్‌చల్, దాడితో షాక్‌కు గరైన హీరో, కారులో ఇంటికి పంపించేసిన సిబ్బంది, హస్తినాపురంలో ఘటన
ఓ మూవీ షూటింగ్ లో ఉండగా రౌడీ షీటర్ అతనిపై దాడికి యత్నించాడు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ఓ వెబ్ సిరీస్ (Web series) షూటింగ్ జరుగుతండగా ఈ ఘటన జరిగింది. వీజే సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్ తో పేరు తెచ్చుకొని బిగ్‌బాస్ లో (Bigg boss) పాల్గొని గత సీజన్ బిగ్‌బాస్ విన్నర్ గా నిలిచాడు
Hyderabad, June 10; బిగ్ బాస్ తెలుగు విన్నర్ వీజే సన్నీపై (VJ Sunny) దాడి జరిగింది. ఓ మూవీ షూటింగ్ లో ఉండగా రౌడీ షీటర్ అతనిపై దాడికి యత్నించాడు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ఓ వెబ్ సిరీస్ (Web series) షూటింగ్ జరుగుతండగా ఈ ఘటన జరిగింది. వీజే సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్ తో పేరు తెచ్చుకొని బిగ్‌బాస్ లో (Bigg boss) పాల్గొని గత సీజన్ బిగ్‌బాస్ విన్నర్ గా నిలిచాడు సన్నీ. దీంతో సన్నీకి మరింత ఫేమ్ రావడంతో పాటు పలు అవకాశాలు కూడా వరుసగా తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో, సిరీస్ లలో నటిస్తున్నాడు సన్నీ. హరీష్ శంకర్ (Harish Shankar) రాసిన కథ ఏటీఎం అనే సిరీస్ లో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సిరీస్ హైదరాబాద్‌లోని హస్తినాపురం ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంది. అయితే ఇవాళ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ రౌడీషీటర్ సెట్‌కు వచ్చి హల్‌చల్ చేశాడు.
అలాగే హీరో సన్నీతో గొడవకు దిగి అతడిపై దాడి కూడా చేశాడు. దీంతో అక్కడ ఉన్న షూటింగ్ సిబ్బంది వెంటనే సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సన్నీపై దాడి జరిగిన సంఘటన ప్రస్తుతం చర్చగా మారింది.