ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్‌ బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. చెన్నైలోని మహాబలిపురంలో గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేశ్‌ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తన అర్ధాంగికి నుదుటన ముద్దు పెట్టిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'నయన్‌, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు చిలకా గోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)