Beer Sales in Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు, 18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేసిన మందుబాబులు

ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేశారు. గడిచిన 18 రోజుల్లో 670 కోట్ల రూపాయల బీర్లు తెలంగాణ మందుబాబులు తాగేశారని నివేదికలు చెబుతున్నాయి .

Beer Bottles | Representational Image | (Photo Credits: Pixabay)

Hyd, April 24: తెలంగాణలో గతేడాది రికార్డు స్థాయిలో మందుబాబులు మద్యం తాగేసిన సంగతి విదితమే. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేశారు. గడిచిన 18 రోజుల్లో 670 కోట్ల రూపాయల బీర్లు తెలంగాణ మందుబాబులు తాగేశారని నివేదికలు చెబుతున్నాయి . దీంతో గత సంవత్సరం కంటే 28.7 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని చెబుతున్నారు.  రాబోయే మూడు రోజుల పాటూ వాన‌లే వానలు, ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఈ జిల్లాల్లో వ‌డగండ్లు ప‌డే అవ‌కాశం

తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. కాగా 2023లో రూ.36,151 కోట్లకుపైగా విలువైన 3.58కోట్ల కేసుల లిక్కర్‌, 5.34 కోట్ల కేసుల బీర్‌ను మందుబాబులు తాగారు. 2022లో కంటే దాదాపు రెండు వేల కోట్లు విలువైన మద్యాన్నిఅధికంగా మద్యం ప్రియులు తాగినట్లు ఆబ్కారీ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడించాయి.ప్రస్తుతం ప్రభుత్వం కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న బీర్ల అమ్మకాలకు తగ్గట్టుగా స్టాక్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలుస్తుంది.