IMD Issues Orange Alert: రాబోయే మూడు రోజుల పాటూ వాన‌లే వానలు, ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఈ జిల్లాల్లో వ‌డగండ్లు ప‌డే అవ‌కాశం
rains

Hyderabad, April 20: తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల వడగండ్ల వానలు (Hailstorm) కురిసే అవకాశం ఉందని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను (Orange Alert) జారీ చేసింది.

Rain in Hyderabad: ఉక్కబోతలో చల్లటి ఉపశమనం.. హైదరాబాద్‌ లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం 

నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు సూచనలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం వరకు మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి,  హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.