Local Body MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు ఎన్నికలు
తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.
Hyd, Nov 9: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ (Localbody MLC Elections Schedule Released) విడుదలైంది. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.అనంతపురం-1, కృష్ణా-2, తూర్పుగోదావరి-1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.
తెలంగాణలో( Local Body MLC Elections in TS) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.
ఏపీలో షెడ్యూల్
అనంతపురం-01
కృష్ణా-02
తూర్పుగోదావరి-01
గుంటూరు-02
విజయనగరం-01
విశాఖపట్నం-02
ప్రకాశం-01
చిత్తూరు-01
తెలంగాణలో షెడ్యూల్
ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో స్థానానికి ఎన్నికలు
కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ
ఎన్నికల షెడ్యూల్
నవంబర్-16న నోటిఫికేషన్
నవంబర్-23 నామినేషన్ల స్వీకరణ
నవంబర్- 24 నామినేషన్ల పరిశీలన
నవంబర్ 26 ఉపసంహరణ
డిసెంబర్ 10 పోలింగ్
డిసెంబర్ 14 కౌంటింగ్