Raids on Alpha Hotel: సికింద్రాబాద్ లోని ఫేమస్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు.. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్.. కేసు నమోదు చేసిన అధికారులు

ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి డెజర్ట్స్ ను ఆర్డర్ చెయ్యాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్నది. ఐస్ క్రీమ్ లలో చేతివేలు, జెర్రీ, చిప్స్ ప్యాకెట్లలో కప్పలను చూడటం తెలిసిందే.

Raids on Alpha Hotel (Credits: X)

Hyderabad, June 20: బయటకి వెళ్లి డిన్నర్ (Dinner) చేయాలన్నా.. ఐస్ క్రీమ్ (Ice Cream), స్వీట్స్ (Sweets) వంటి డెజర్ట్స్ ను ఆర్డర్ చెయ్యాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్నది. ఐస్ క్రీమ్ లలో చేతివేలు, జెర్రీ, చిప్స్ ప్యాకెట్లలో కప్పలను చూడటం తెలిసిందే. ఫేమస్ హోటల్స్ లో కూడా ఆహార పదార్థాల తయారీలో ప్రమాణాలు పాటించకపోవడమూ వింటూనే ఉన్నాం. ఇదీ అలాంటి ఘటనే.. సికింద్రాబాద్ లోని ఫేమస్ ఆల్ఫా హోటల్ లో ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదన్న ఫిర్యాదుల మేరకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

బాబోయ్ వాయు కాలుష్యం.. 2021 ఒక్క ఏడాదిలోనే 21 లక్షలమంది మరణం.. అమెరికా హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ సంస్థ వెల్లడి

అన్ని ఉల్లంఘనలే

ఈ రైడ్స్ లో చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్, మాంసాహార ముడి పదార్థాలను అధికారులు గుర్తించారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్ బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా గమనించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్ పై ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు నోటీసులు జారీ చేశారు.

డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif