Accident in Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొట్టడంతో ఎగిరి అదే కారు అద్దంపై పడ్డ వృద్ధుడు.. కారు అద్దం మెడకు కోసుకుపోయి వృద్ధుడి తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డ హృదయ విదారక దృశ్యం

రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఓ కారు ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు ఎగిరి అదే కారు అద్దంపై పడ్డాడు.

Representative Image (File Image)

Hyderabad, Aug 7: హైదరాబాద్ (Hyderabad) శివారుల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘోర ప్రమాదం (Accident) జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఓ కారు ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు ఎగిరి అదే కారు అద్దంపై పడ్డాడు. ఈ క్రమంలో ఆయన తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. ఈ హృదయ విదారక సంఘటన శంషాబాద్ మున్సిపల్ పరిధి తొండుపల్లి సమీపంలోని ఓఆర్ఆర్ పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్య (65)గా పోలీసులు గుర్తించారు.

బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి

అసలేం జరిగిందంటే?

అంజయ్య వృత్తిరీత్యా రోజువారీ కూలీ. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. రాత్రి దారి తప్పి ఔటర్ మీదుగా తుక్కుగూడ వైపు నడుచుకుంటూ బయల్దేరారు. తొండుపల్లి కూడలి వద్ద ఔటర్ ప్రధాన రహదారిని దాటుతున్నాడు. అంతలో గచ్చిబౌలి నుంచి వేగంగా వచ్చిన ఓ కారు అంజయ్యను బలంగా ఢీకొట్టింది. కారు వేగానికి అంజయ్య అదే కారుపై ఎగిరి పడ్డాడు.

రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

తల నేరుగా కారు అద్దాన్ని..

దీంతో అంజయ్య తల నేరుగా కారు అద్దాన్ని తాకింది. దీంతో అద్దం పగిలి తల అందులో ఇరుక్కుపోయింది. అయితే వాహనం వేగంగా వెళ్తుండటంతో మెడ కోసుకుపోయి తల లోపల సీట్లో, మొండెం రోడ్డుపై పడ్డాయి. రోడ్డు మీద వెళ్తున్న పలువురు వాహనదారులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్