Singer Sai Chand Died: గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం, 39 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమగాయకుడు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు (Heart attack) రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.
Hyderabad, June 29: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు (Heart attack) రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. 1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన.. విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటిచెప్పారు.
2021, డిసెంబర్‌లో సాయిచంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాగా, సాయిచంద్ ఆకస్మిక మృతిని తెలుకున్న ఎంపీ సంతోష్ కుమార్.. కేర్ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.