Adulterated Ice Creams: సమ్మర్ అని ఐస్‌క్రీమ్స్ తెగ లాగించేస్తున్నారా? పైన బ్రాండెడ్ స్టిక్కర్, లోపల నకిలీ ఐస్‌క్రీమ్, హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ ముఠా గుట్టురట్టు

చందానగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నాసిరకం ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అక్కడ జరుగుతున్న తంతు చూసి పోలీసులే షాక్ తిన్నారు. పైకేమో బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్.. లోపలేమో నాసిరకం సరుకు..

Adulterated Ice Creams (PIC @ Twitter)

Hyderabad, April 14: డబ్బు సంపాదన కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు దుర్మార్గులు. ప్రజల ఆరోగ్యాన్నిపణంగా పెట్టి జేబులు నింపుకుంటున్నారు. నిన్న అత్తాపూర్ లో నకిలీ చాక్లెట్ల తయారీ దందా వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అది మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. ఈసారి నాసిరకం ఐస్ క్రీమ్స్ తయారీ (Adulterated Ice Creams) దందా బయటపడింది. చందానగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నాసిరకం ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అక్కడ జరుగుతున్న తంతు చూసి పోలీసులే షాక్ తిన్నారు. పైకేమో బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్.. లోపలేమో నాసిరకం సరుకు.. ఇదీ అక్కడ జరుగుతున్న వైనం. బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ తో నాసిరకం ఐస్ క్రీమ్ లు తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. రూ.10లక్షల విలువ చేసే ముడిపదార్ధాలను సీజ్ చేశారు.  శ్రీనివాస్ రెడ్డి ఐదేళ్లుగా ఈ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, భార్యను రోడ్డు మీద వెంబడించి కత్తితో నరికి చంపిన భర్త, అనుమానంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణ 

ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్స్ తయారు (Adulterated Ice Creams) చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు (SOT Police) చందానగర్ లో ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్న గోదాంపై దాడి చేశారు. అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసి పోలీసులే నివ్వెరపోయారు. నాసిరకమైన ముడి సరుకు ఉపయోగించి ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్నారు. అంతేకాదు, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వాటికి మార్కెట్ లో డిమాండ్ ఉన్న బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కంపెనీల లేబుల్స్ అతికిస్తున్నారు. అనంతరం మార్కెట్ లో విక్రయిస్తున్నారు. శుభకార్యాలకు కూడా ఈ కల్తీ ఐస్ క్రీమ్స్ ను సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి గోదాం నుంచి రూ.10లక్షల విలువైన ఐస్ క్రీమ్ తయారీ ముడి సరుకును పోలీసులు సీజ్ చేయడం గమనార్హం. పలు ఫ్లేవర్ల ఐస్ క్రీమ్స్, బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కంపెనీల లేబుల్స్ సీజ్ చేశామన్నారు. కాగా, గత ఐదేళ్లుగా శ్రీనివాస్ రెడ్డి ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు, స్థానికులు విస్తుపోయారు.

Gudivada Development Row: గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కొడాలి నాని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ 

ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీనివాస్ రెడ్డి ఐస్ క్రీమ్ తయారీ పరిశ్రమ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు అనుమతులే లేవు, ఆపై ఐస్ క్రీమ్ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. దానికి తోడు ప్రమాదకరమైన రసాయనాల వినియోగం. ఇదీ.. అక్కడ జరుగుతున్న తంతు. అసలే ఇది సమ్మర్. ఈ వేసవిలో ఐస్ క్రీమ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఐస్ క్రీమ్ తినేందుకు ఇష్టపడతారు. ఈ డిమాండ్ ను కొందరు దుర్మార్గులు ఇలా క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బు కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ లు తయారు చేసి వాటికి బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు వేసి గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ లో అమ్మేస్తున్నారు.

Ambedkar Jayanti 2023:దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్, ఆయన చేసిన కృషి మరువలేం, రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన సీఎం జగన్‌ 

కాగా, నిన్న అత్తాపూర్ లో నూ ఇలాంటి దారుణం ఒకటి వెలుగుచూసింది. నకిలీ చాక్లెట్ల తయారీ దందా బట్టబయలైంది. ఎలాంటి అనుమతుల లేకుండా ఇళ్ల మధ్యనే నడుస్తున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్ ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ పరిశ్రమలో ప్రమాదకర రసాయనాలు, కలుషిత నీరు, నాసిరకం ముడి సరుకు, అపరిశుభ్ర వాతావరణంలో చాక్లెట్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో డ్రముల్లో పానకం నిల్వ ఉంచి అదే పానకంతో చాక్లెట్లు, లాలీపాప్ లు తయారు చేస్తున్నారు. ఇలాంటి చాక్లెట్లు తింటే పిల్లల ప్రాణాలకు ప్రమాదం తప్పదని డాక్టర్లు హెచ్చరించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif