Gadwal Horror: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని సలసల మరిగే నూనెను మీద పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు.. గద్వాల్ లో ఘటన

బజ్జీలు ఉద్దేర ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి సలసల మరిగే నూనెను పోసిన ఘటన గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో జరిగింది.

Gadwal Horror (Credits: X)

Hyderabad, Sep 30: బజ్జీలు ఉద్దేర ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి సలసల మరిగే నూనెను పోసిన ఘటన గద్వాల్ (Gadwal Horror) జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ హోటల్ (Hotel) నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి హోటల్ వద్దకు వచ్చి రూ. 30  బజ్జీలు ఉద్దెర అడిగాడు. అయితే, ఉద్దెర ఇవ్వడం కుదరదని, ఇప్పటికే చేసిన అప్పును తీర్చలంటూ బుజ్జన్న గౌడ్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరింది.

వామ్మో, కారు డోర్ ఓపెన్ చేయగానే పైకి దూసుకొచ్చిన 8 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే...

విచక్షణ మరిచి..

వాగ్వివాదం పెరుగడంతో సహనం కోల్పోయి విచక్షణ మరిచిన వినోద్ అక్కడే పొయ్యి మీద సల సల మరిగుతున్న నూనెను బుజ్జన్న గౌడ్‌పై పోశాడు. ఆ నూనె బుజ్జన్న గౌడ్ పైనే కాకుండా పక్కనే ఉన్న వీరేశ్ అనే మరో వ్యక్తి ముఖంపై కూడా పడింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం.. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేసిన యువకుడు (వీడియో)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif