Hyderabad: తన పిల్లల టీసీ ఇవ్వాలంటూ స్కూలు ఎదుట తండ్రి అర్థ నగ్న ప్రదర్శన, యాజమాన్యం కాళ్ళు మొక్కినా కనికరించలేదని ఆవేదన

నాగోల్‌లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన పిల్లలకు TC, బోనోపైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని విద్యార్థి తండ్రి ధర్మరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Student's father staged a half-naked demonstration at Akshara Techno School in Hyderabad

నాగోల్‌లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన పిల్లలకు TC, బోనోపైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని విద్యార్థి తండ్రి ధర్మరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్ లో చదివితే 6 ఏళ్లుగా బోనోపైడ్, టీసీ కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపించాడు. కాళ్ళు మొక్కినా కనికరించలేదని ధర్మరెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేశాడు. వీడియో ఇదిగో, పూరీ కూరలో ప్రత్యక్షమైన పురుగు, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, హోటల్ యజమాని స్పందన ఏంటంటే..

నాగోల్ లో నివాసం ఉంటున్న ధర్మరెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు నాగోల్ లోని అక్షర టెక్నో స్కూల్ లో చేర్పించాడు. ఇందులో 6 ఏళ్లుగా వారిద్దరు పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. అయితే విద్యార్థి తండ్రికి ఫీజులు కట్టాలని యాజమాన్యం వత్తిడి పెరిగింది. అంత డబ్బులు ఇవ్వలేనని ధర్మరెడ్డి తేల్చి చెప్పాడు. అయితే రోజూ ఇద్దరు పిల్లల ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేయడంపై ధర్మరెడ్డి విసుగు చెందాడు. తన ఇద్దరి పిల్లల బోనోఫైడ్, టీసీ ఇచ్చేయాలని కోరాడు. తన ఇద్దరు పిల్లలను వేరే స్కూల్ లో చేర్పిస్తానని తెలిపాడు.

Here's Video

అయితే దీంతో యాజమాన్యం తన ఇద్దరి పిల్లల టీసీ, బోనోఫైడ్ లను ఇవ్వనని డబ్బులు కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఇంత డబ్బులు కట్టలేని బోనోపైడ్, టీసీ ఇచ్చేస్తే తన స్తోమతకు తగ్గ స్కూల్ లో చేర్పించు చదివించుకుంటా అంటూ యాజమాన్యం కాళ్లవేళ్లా పడ్డారు. అయినా అక్షర టెక్నో స్కూల్ కనికరం చూపలేదు. దీంతో సహనం కోల్పోయిన ధర్మరెడ్డి న్యాయం చేయాలని కోరుతూ బోర్డు పట్టుకుని, అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ..అక్షర టెక్నో స్కూల్ ముందు రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. అయితే దీనిపై స్కూలు యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement