Harish Rao Fire on PM Modi: మోదీజీ కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమేదీ! తెలంగాణకు వరాలేవి? మరోసారి మొండిచెయ్యి ఎందుకిచ్చారంటూ నిలదీసిన మంత్రి హరీష్ రావు

క‌ల్ల‌బొల్లి క‌బుర్లు, జుమ్లా మాట‌లు త‌ప్ప విధాన‌మేదీ లేద‌ని తేల్చేశార‌ని #ModiMustAnswer అనే పేరుతో ప్ర‌ధాని మోదీపై (Fire on Modi) మండి ప‌డ్డారు.

Harish Rao tested positve for Corona (photo-PTI)

Hyderabad, July 03: సీఎం కేసీఆర్‌ (CM KCR) అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఒక్క‌దానికీ ప్ర‌ధాని మోదీ(PM Modi) జ‌వాబు చెప్ప‌లేద‌ని, అస‌లు త‌మ‌కు జ‌వాబుదారీత‌న‌మే లేద‌ని నిరూపించుకున్నార‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హ‌రీశ్ రావు (Harish rao) మండి ప‌డ్డారు. క‌ల్ల‌బొల్లి క‌బుర్లు, జుమ్లా మాట‌లు త‌ప్ప విధాన‌మేదీ లేద‌ని తేల్చేశార‌ని #ModiMustAnswer అనే పేరుతో ప్ర‌ధాని మోదీపై (Fire on Modi) మండి ప‌డ్డారు. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల వేదిక నుంచి దేశ‌, తెలంగాణ అభివృద్ధికి విధాన నిర్ణ‌య‌మేదైనా ప్ర‌క‌టిస్తార‌ని ఆశించామ‌ని ఆదివారం వ‌రుస ట్వీట్లు చేశారు. తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ మొండి చెయ్యి ఇచ్చార‌న్నారు. గుజ‌రాత్‌కు (Gujrat) వ‌రాలు ఇస్తారు. క్రూడాయిల్ రాయ‌ల్టీ 763 కోట్లు విడుద‌ల చేశారు. రాజ్‌కోట్‌కు ఎయిమ్స్(AIIMS) ఇస్తారు. బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. ఆయుర్వేదిక్ యూనివ‌ర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు.. ట్రెడిష‌న‌ల్ మెడిసిన్‌పై గ్లోబ‌ల్ సెంట‌ర్ మంజూరు చేశారు.. నేష‌న‌ల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు మిష‌న్ యూపీకింద రూ. 55,563 కోట్లు ఇచ్చారు. 9 మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చారు. కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ ఇచ్చారు..క‌ర్నాట‌క‌కు తూముకూర్ ఇండ‌స్ట్రీయ‌ల్ స్మార్ట్ సిటీ, ముంబాయి-బెంగ‌ళూరు ఎక‌నామిక్ కారిడార్‌, మైసూర్ టెక్స్‌టైల్ మెగా క్ల‌స్ట‌ర్‌.. ఇట్లా ఎన్నో ఇచ్చారు. తెలంగాణకూ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ, మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్ర‌జ‌ల‌కు ప‌నికివ‌చ్చే ప్ర‌క‌ట‌న చేయ‌లేదు` అని హ‌రీశ్ రావు ఫైర్ అయ్యారు.

రాష్ట్రం నుంచి ల‌క్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామ‌ని చెబుతున్నారు మోదీగారు.. మ‌రి గ‌త‌ నెల రోజులుగా 90 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవ‌డంలేదు. సీఎంఆర్ తీసుకునేందుకు నిరాక‌రిస్తున్న‌ది. దీనివిలువ రూ.22వేల కోట్లు ఉంటుంది. ఇదేనా మీ రైతు అనుకూల‌త మోదీ గారు? మా రైతుల ధాన్యం సీఎంఆర్ తీసుకుంటామ‌ని స‌భా వేదిక నుంచి ప్ర‌క‌టిస్తార‌ని ఆశించాం.. క‌నీసం ఊసెత్త‌లేదు` అని ఆరోపించారు.

PM Modi Rally in Hyderabad: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్‌ రావడం పక్కా, అభివృద్ధి ఎజెండాతో సాగిన ప్రధాని మోదీ ప్రసంగం, తెలంగాణకు ఏం చేశామో చెప్పిన మోదీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీ 

`మోదీగారు.. మీ ప్ర‌సంగంలో మ‌హిళ‌ను మీరేదో ఉద్ద‌రిస్తున్న‌ట్టు చెప్పారు. మ‌రి పార్ల‌మెంటులో పెండింగ్‌లో ఉన్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఎనిమిదేండ్ల‌యినా ఎందుకు ఆమోదించ‌లేదు ? స‌మాధానం ఎందుకు చెప్ప‌లేదు ? తెలంగాణాలో స్థానిక సంస్థ‌ల్లో 50 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న‌తో మా సీఎం కేసీఆర్ నిబ‌ద్ధ‌త చాటుకున్నారు` అని హ‌రీశ్ రావు చెప్పారు.

BJP National Executive Meeting : ముగిసిన బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం, పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభకు బయలు దేరిన ప్రధాని మోదీ, హైదరాబాద్ గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే.. 

`రాష్ట్ర‌ప‌తిగా గిరిజ‌న మ‌హిళ‌కు అవ‌కాశం ఇచ్చామ‌ని మీ కేంద్ర మంత్రులు విజ‌య సంక‌ల్ప స‌భ వేదిక‌గా చెప్పారు. బాగానే ఉంది. మా రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. దాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు మీ ప్ర‌భుత్వం ఆమోదించ‌లేదు. దీనిపై కూడా మీరు వేదిక‌పై స‌మాధానం చెప్తార‌ని మా గిరిజ‌న సోద‌రులు భావించారు. అంతే కాదు.. మా గిరిజ‌న యూనివ‌ర్సిటీకి ఇప్ప‌టికీ నిధులు ఇవ్వ‌లేదు. అనుమ‌తులు ఇవ్వ‌లేదు. మా స‌మ్మ‌క్క‌సార‌క్క ఉత్స‌వానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు..? తెలంగాణ గిరిజ‌నులు మీకు క‌నిపించ‌డంలేదా ? ` అని ఫైర్ అయ్యారు.