Coronavirus in Telangana: 45 రోజులు శిశువు కరోనాని జయించింది, దేశ చరిత్రలోనే ఇది తొలికేసు, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జి
కరోనా నుంచి 45 రోజుల శిశువు (45-day old infant) కోలుకుని వైద్యలను ఆశ్చర్యపరిచింది. డాక్టర్లను సైతం కాటికి పంపిన కరోనావైరస్ ని 40 రోజుల శిశువు తరిమికొట్టడం దేశ చరిత్రలోనే ప్రధమంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడైన ఈ COVID-19 పేషెంట్ తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి (Gandhi hospital in Hyderabad) నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
Hyderabad, April 30: తెలంగాణలో అద్భుతం జరిగింది. కరోనా నుంచి 45 రోజుల శిశువు (45-day old infant) కోలుకుని వైద్యులను ఆశ్చర్యపరిచింది. డాక్టర్లను సైతం కాటికి పంపిన కరోనావైరస్ ని 40 రోజుల శిశువు తరిమికొట్టడం దేశ చరిత్రలోనే ప్రధమంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడైన ఈ COVID-19 పేషెంట్ తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆస్పత్రి (Gandhi hospital in Hyderabad) నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 11 జిల్లాలు కరోనా రహితం, తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్, మే 8 నాటికి కరోనారహిత రాష్ట్రం, ఆశాభావం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో (Telangana COVID-19) బుధవారం మొత్తం 35 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వీరిలో 45 రోజుల శిశువు, 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 13 మంది పిల్లలు ఉన్నారు. గాంధీ ఆసుపత్రి అధికారులు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ నెలలో మహబూబ్‌నగర్‌కు చెందిన 20 రోజుల శిశువుకు తండ్రి నుంచి వైరస్ సోకింది. వైరస్ సోకిన ఆ చిన్నారిని 25 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేర్చగా.. కోలుకున్న ఆ శిశువును బుధవారం ఆస్పత్రి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆ శిశువు వయసు 45 రోజులు. ఇలా 20 రోజుల శిశువు కరోనా వైరస్ బారిన పడి కోలువడమనేది దేశంలోనే ఇదే ప్రథమమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘనత గాంధీ ఆస్పత్రి వైద్యులకే దక్కిందని పేర్కొంటున్నాయి. మే 4 నుంచి లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలు, మరిన్ని సడలింపులు లభించే చాన్స్, సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలు, విద్యార్థులకు ఇప్పటికే అనుమతి
రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. బుధవారం కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. అయితే గడిచిన 6 రోజుల్లో కలిపి కేవలం 46 కేసులే వచ్చాయి. కేసుల సంఖ్య బాగా తగ్గు ముఖం పడుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంటోంది. ఈ నెలలో సింగిల్ డిజిట్ కేసులు నమోదు కావడం ఇది ఐదోసారి కాగా.. వరుసగా ఇది మూడో రోజు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 582 యాక్టివ్ కేసులున్నాయి. ప్రజల ఆహార అవసరాలకు సరిపోయే, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలి! ఏ పంటలు సాగుచేస్తే రైతులకు లాభమో మే 5 లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణలో ఒక్క యాక్టివ్ కేసు లేని జిల్లాలు 11 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటిలో సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, భద్రాద్రి, నాగర్ కర్నూల్, ములుగు, యాదాద్రి జిల్లాలున్నాయి.