Liquor Sales in Telangana: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్, న్యూఇయర్ నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలెన్ని అంటే! ఏపీలోనూ రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్
ముఖ్యంగా తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ(Excise) తెలిపింది. డిసెంబర్(December) నెలలోనే తెలంగాణలో అత్యధిక విక్రయాలు(Telangana Liquor sale highest) నమోదయ్యాయి.
Hyderabad January 01: సంవత్సరం చివరి రోజు (Year End)తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లిక్కర్ అమ్మకాలు(Highest Liquor sale) జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ(Excise) తెలిపింది. డిసెంబర్(December) నెలలోనే తెలంగాణలో అత్యధిక విక్రయాలు(Telangana Liquor sale highest) నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.171 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఐదు రోజుల వ్యవధిలోనే రూ.902 కోట్ల మద్యాన్ని మందుబాబులు స్వాహా చేశారు.
గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం(Liquor) అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల అమ్మకాలు జరగ్గా.. 2021 శుక్రవారం సాయంత్రానికే 30,196 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 6,970 కోట్లు, నల్గొండ జిల్లాలో 3288 కోట్లు, హైదరాబాద్‌లో 3,201 కోట్ల అమ్మకాలు నమోదయినట్లు ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది.
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.24.78 కోట్లు, హైదరాబాద్ రూ.23.13 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.
అటు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఒక్కరోజే రూ.120 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. లక్షా 89,606 మద్యం కేసులు విక్రయించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఒక రోజు మద్యం అమ్మకాల్లో ఇదే రికార్డు అమ్మకాలని తెలిపారు. 2019లో రాష్ట్రంలో నిలిపివేసిన ప్రీమియం మద్యం(Premium Liquor sales) అమ్మకాలను తిరిగి ప్రారంభించిన రోజునే భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు.
ప్రతిరోజు ఏపీలో 70 నుంచి 80 కోట్ల రూపాయల విలువ గల మద్యం విక్రయాలు కొనసాగుతుండగా గత 5 రోజులుగా వంద కోట్ల మార్కును దాటుతూ వస్తుంది. ఇక నూతన సంవత్సర వేడుకల(New Year) సందర్భంగా దాదాపు 40 కోట్ల రూపాయల అదనంగా మద్యం విక్రయాలు జరిగాయి. రిటైల్ అవుట్‌లెట్స్, బార్ల(Bars)కు డిసెంబర్ 31 రాత్రి అదనంగా మరో గంట విక్రయాలకు అనుమతి ఇవ్వడం కూడా విక్రయాల పెరుగుదలకు కారణమని అధికారులు వెల్లడించారు.