TS Budget Session 2022: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, బడ్జెట్‌పై ప్రసంగించిన సీఎం కేసీఆర్, హిజాబ్ వివాదం ఎందుకని ప్రశ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని (TS Budget session 2022) నిరవధిక వాయిదా వేశారు.ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో (TS Budget session 2022) మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని (TS Budget session 2022) నిరవధిక వాయిదా వేశారు.ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో (TS Budget session 2022) మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి. 54 గంటల 47 నిమిషాలు పని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రసంగించారు. బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం కాదని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు.. బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే చెబుతారన్న అపోహా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్ అద్భుతమని అధికారపక్షం అంటే, బాగాలేదని ప్రతిపక్షం విమర్శిస్తుందన్నారు.
ఈ విమర్శలు సహజమని అన్నారు. బడ్జెట్ అనేది నిధుల కూర్పు అని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ తొలి బడ్జెట్ 190 కోట్లు అయితే అందులో 91 కోట్లు రక్షణకే కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాలకు అప్పులు సహజమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఏపీ బడ్జెట్ రూ.680 కోట్లు ఉంటే ఇప్పుడేమో బడ్జెట్ లక్షల కోట్లకు చేరిందన్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రెండే అధికారులు ఉంటాయన్న కేసీఆర్.. ఎవరికైనా ట్యాక్స్‌లు వేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చని తెలిపారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు.
రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా నిర్మిలించామని చెప్పారు. అప్పులనేది వనరుల సమీకరణ కింద భావిస్తామని. వనరుల సమీకరణలోనూ కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తున్నామని తెలిపారు. అప్పులుచేసే రాష్ట్రాల్లో మన ర్యాంకు 28గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్కేంద్రం విషయాలను ఇక్కడ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క గట్టిగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే భట్టిని పార్లమెంట్‌కు పంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇన్నాళ్లకు తమపై భట్టికి దయ కలిగిందని, మన ఊరు- మన బడి మంచిదని భట్టి చెప్పినట్లు తెలిపారు. భట్టికి ప్రమోషన్ ఇవ్వాలని తెలిపారు. తన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్న భట్టి ధన్యవాదాలు తెలిపారు.
‘మన అప్పులు శాతం కూడా 23 శాతమే. మనకంటే ఎక్కువ అప్పులుచేస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అప్పులపై భట్టికి ఆందోళన అక్కర్లేదు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచేస్తాం అనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉంది. కేంద్రం పనితీరు మనకన్నా దారుణంగా ఉంది. ప్రస్తుతం భారతదేశం అలప్పు 152 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తోంది. దేశంలో ఫెడరలిజం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఐఎస్‌ఎస్‌ల విషయంలోనూ కేంద్రం కొత్త అధికారాల కోసం ప్రయత్నిస్తోంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పాం.
హైదరాబాద్ ఐటీ ఎగుమతుల విలువ ఏడాదికి దాదాపు లక్షన్నర కోట్లు. రాష్ట్రాల్లో పరిస్థితులు దిగజారితే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి. హిజాబ్ వంటి సమస్యలు ఉంటే పారిశ్రామిక వేత్తలు వస్తారా? మత చిచ్చు దేశానికి మంచిది కాదు. దేశంలో మతోన్మాదం, మూకదాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి వివాదాలు మన దేశ యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి. 25 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఎంబీబీఎస్ చదవుకోడానికి అక్కడికి వెళ్లారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ఖర్చు తక్కువ అని విద్యార్థులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం చదివిస్తుంది.’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉక్రెయిన్ విద్యార్థులకు ప్రభుత్వ సాయం చేస్తుందని, ఎంత ఖర్చు అయినా భరించి వారి భవిష్యత్ తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసలు హిజాబ్ వివాదం ఎందుకని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీశారు. మతకలహాలు సృష్టిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి పరోక్షంగా బీజేపీని విమర్శించారు. దేశంలో రాజకీయాలంటే పిక్నిక్‌లా మారాయన్నారు. కేంద్ర అసమర్ధ ఆర్థిక విధానాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని ఆరోపించారు. ఎఫ్ఆర్‌బీఎం విషయంలో కేంద్ర వైఖరి సరిగాలేదన్నారు. రాష్ట్రాల సమైక్యతను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎఫ్ఆర్‌బీఎం విషయంలో కేంద్రం కంటే తెలంగాణ బెటర్ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఏ ప్రభుత్వానికైనా ప్రణాళిక విభాగం అత్యంత కీలకమని అన్నారు. భట్టి విక్రమార్క లేవనెత్తే చాలా అంశాలు పార్లమెంట్ వేదికగా నిలదీస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటున్న ప్రతిపక్షాలు.. అవి అప్పులు కాదు నిధుల సమీకరణ అని తెలుసుకోవాలన్నారు. నిధులు ఎలా సమకూర్చుకోవాలో చెప్పేదే బడ్జెట్ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సెర్చ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం ఇస్తామన్నారు.
చిన్న ఉద్యోగులకు 30 శాతం పెంపు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉండేవని, ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్ర ఆదాయం పెంపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మార్పిలోపు 40 వేల మందికి దళితబంధు ఇస్తామని, స్వయం ఉపాథి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)