Telangana Assembly Elections: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ, షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని వెల్లడి, కవితను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని తెలిపిన సీఎం

రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. స‌ర్వేల‌న్నీ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు.

CM KCR (Photo-ANI)

Hyd, Mar 10: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌( Telangana Assembly Elections )పై బీఆర్ఎస్ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. స‌ర్వేల‌న్నీ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌( Telangana Bhavan )లో జ‌రుగుతున్న బీఆర్ఎస్( BRS Party ) విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌లు అంశాల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో ఉంటాయ‌ని, ఆ లోపు ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు. నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీలైతే పాద‌యాత్ర‌లు చేయాల‌ని చెప్పారు. వీలైన‌న్ని ఎక్కువ‌గా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని సూచించారు.

మనీశ్‌ సిసోడియాకు ఎదురుదెబ్బ, మార్చి 17 వరకు ఈడీ కస్టడీ పొడిగించించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు, సీబీఐ రిమాండ్‌పై విచారణ ఈ నెల 21కి వాయిదా

కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. ‘‘రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. ​​​మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

న‌వంబ‌ర్, డిసెంబ‌ర్‌లో తెలంగాణ‌ ఎన్నిక‌లు, కీలక వ్యాఖ్యలు చేసిన కవిత, ఈడీ విచార‌ణ‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడి

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్సే గెలుస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు ప్లాన్‌ చేసుకోండి. అవసరమైన చోట యాత్రలు, పాదయాత్రలు నిర్వహించాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.