Telangana: సరస్వతి దేవి చదువుల తల్లి కాదంటూ రెంజర్ల రాజేష్ వ్యంగ్య వ్యాఖ్యలు, భగ్గు మన్న బాసర, రాజేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాసర గ్రామస్థులు

చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్‌ (Atheist Renjarla Rajesh) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు (huge protests outside Gnana Saraswati Temple) పిలుపునిచ్చారు

Basara Protest (Photo-Twitter)

Basara, Jan 3: తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్‌ (Atheist Renjarla Rajesh) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు (huge protests outside Gnana Saraswati Temple) పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్‌ మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై (Renjarla Rajesh) కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్‌ దిష్టిబోమ్మను దగ్దం చేశారు‌. బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమంటున్న హిందూ సమాజం, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు

ఈ క్రమంలోనే బాసర పోలీస్‌ స్టేషన్‌లో రేంజర్ల రాజేశ్‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. రాజేష్‌పై పిడి యాక్ట్ (PD Act) పెట్టాలని రాస్తారోకోకు దిగారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేష్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన పక్కనే రెంజర్ల రాజేష్ కూడా ఉన్నారు. వివాదం ముదిరిన సందర్భంలో బైరి నరేష్‌కు సోషల్ మీడియా (Social Media)లో మద్దతు తెలిపి వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఈ క్రమంలోనే రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు.

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్​

కాగా సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిని శ్లోకం పై రెంజర్ల రాజేష్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సరస్వతి దేవి చదువుల తల్లి కాదని.. మ్యూజిక్‌ టీచర్‌' అంటూ రాజేశ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సరస్వతి దేవీ ఏ యూనివర్సిటీలో చదువుకోని వచ్చిందని ప్రశ్నించారు. సరస్వతి దేవి చదువుల తల్లి అయితే పుస్తకం ఉండాలి కదా, వీణ ఎందుకు ఉంది? అంటే ఆమె మ్యూజిక్‌ టీచర్‌ కదా అంటూ పదే పదే ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఫైర్‌ అవుతున్నాయి.



సంబంధిత వార్తలు