Telangana: బీర్ ప్రియులకు షాక్, ధరలను పెంచే యోచనలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ, ఒక్కో బీర్‌ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లుగా వార్తలు

బీర్ల రేట్లు ఇప్పటికే పెరిగాయి. అయితే సర్కారు మరోసారి పెంచబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీర్‌ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం.

Photo: Wikimedia Commons.

తెలంగాణలో బీర్‌’ప్రియులకు చేదు వార్త. బీర్ల రేట్లు ఇప్పటికే పెరిగాయి. అయితే సర్కారు మరోసారి పెంచబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీర్‌ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం. బీర్‌ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్‌ ధరల పెంపుపై ఎ క్సైజ్‌ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు.

ఈ కసరత్తు అనంతరం ఒక్కో బీర్‌ ధరను రూ.10–20 పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్‌ బీర్‌ రూ.140 ఉండగా దాన్ని రూ.150, స్ట్రాంగ్‌ బీర్‌ రూ.150 ఉండగా, దాన్ని రూ.170 చేయనున్నట్లు సమాచారం.

ఇక మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది.