Telangana: పార్టీ మార్పుపై ఈటెల రాజేందర్ క్లారిటీ, నేను టీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు, టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలిపిన హుజురాబాద్ ఎమ్మెల్యే

తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ లో (TRS) చేరుతున్నానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని ఆయన (MLA Etela Rajender) కొట్టి పారేశారు. ఇదంతా పచ్చి అబద్ధం అన్నారు. ఇది సీఎం కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు.

Etela Rajender (Photo-Twitter)

Hyd, Nov 17: తెలంగాణ బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( BJP Huzurabad MLA Etela Rajender) మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరుతారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫొటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ లో (TRS) చేరుతున్నానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని ఆయన (MLA Etela Rajender) కొట్టి పారేశారు. ఇదంతా పచ్చి అబద్ధం అన్నారు. ఇది సీఎం కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవు, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ లో తాను 20 ఏళ్లు పని చేశానని.. 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయినా తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల చెప్పారు. టీఆర్ఎస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా తాను పార్టీ మారలేదని తెలిపారు. 2015 నుంచి ఆ పార్టీలో, ప్రభుత్వంలో తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈటల తెలిపారు. టీఆర్ఎస్ ను తాను వీడలేదని... సీఎం కేసీఆర్ తనను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని చెప్పారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్ కే ఎక్కువ తెలుసని ఈటల పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు.



సంబంధిత వార్తలు

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif