Etela Rajender Arrest: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్, తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులతో ఎమ్మెల్యే తీవ్ర వాగ్వాదం
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam srinivas reddy)ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela rajender)పై సస్పెన్షన్ వేటు పడింది
Hyd, Sep 13:తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly) వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam srinivas reddy)ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela rajender)పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా అరెస్ట్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన సొంత వాహనంలో బయటకు వెళతానని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. బలవంతంగా ఆయనను పోలీస్ వాహనంలో తరలించారు. ఈ క్రమంలో అసెంబ్లీ (Assembly) వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శాసనసభ నుంచి ఈటల రాజేందర్‌ను పోలీసులు శామీర్‌పేట్‌లోని తన నివాసానికి తరలించారు.
కాగా... ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ పై ఈటల వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఈటల వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాల్సిందే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (MLA Vinay bhasker) డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. చర్చ కన్నా రచ్చ చేసేందుకే వస్తున్నారని మండిపడ్డారు. ఈటల వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈటల మాట్లాడుతూ... ‘‘12ఏళ్లుగా సభలో ఉన్నాను... సభా మర్యాదలు నాకు తెలుసు. సభ నుంచి తనను బయటకు పంపాలని చూస్తున్నారా...మీ ఉద్దేశం ఏంటి’’ అంటూ ప్రశ్నించారు.