Hyd, Sep 13: తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సభ నుంచి సస్పెండ్ (BJP MLA Etela Rajender suspended) చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈటలపై (BJP MLA Etela Rajender) స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈటల క్షమాపణ చెప్పకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ ప్రకటించారు.
కాగా ఈటెల రాజేందర్ ‘‘నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా?.. బెదిరిస్తారా?’’ అంటూ వ్యాఖ్యానించారు.స్పీకర్ మరమనిషిలా పని చేస్తున్నారు. సభా సంప్రదాయాలను మర్చిపోతున్నారు. దీన్ని కాలరాసే అధికారం సీఎంకు లేదు. ఐదు నిమిషాలు సభ నడిపి ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో తప్పించుకోబోరని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 80, 90 రోజులపాటు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 20 రోజులపాటు, వర్షాకాల సమావేశాలు నుంచి 20 రోజుల పాటు జరిగేవని, అలాంటప్పుడు కేవలం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటు జరగడం ఏంటని ఈటల, స్పీకర్ పోచారంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అయితే స్పీకర్ మాత్రం సభ నుంచి బయటకు వెళ్లాలని ఈటలకు సూచించారు. ‘స్పీకర్‌పై ఈటల అమర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలపై ఈటల క్షమాపణ చెప్పలేదని.. సభ గౌరవాన్ని కాపాడేందుకు ఈటలపై చర్యలని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈటల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ కోరారు.