Bandi Sajnjay Nalgonda Tour: సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు, చివ్వెం ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వం వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేత డిమాండ్
బండి సంజయ్ నల్గండ టూర్ (Bandi Sajnjay Nalgonda Tour) సందర్భంగా సూర్యపేట జిల్లా చివ్వెం ఐకేపీ సెంటర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐకేపీ సెంటర్‌ను సందర్శించేందుకు వచ్చిన బండి సంజయ్‌ను స్థానిక టీఆర్‌ఎస్ కార్యకర్తలు ( TRS- BJP clash in Nalgonda) అడ్డుకున్నారు. నల్లజండాలతో నిరసనలు తెలిపారు.
Nalgonda, Nov 14: బండి సంజయ్ నల్గండ టూర్ (Bandi Sajnjay Nalgonda Tour) సందర్భంగా సూర్యపేట జిల్లా చివ్వెం ఐకేపీ సెంటర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐకేపీ సెంటర్‌ను సందర్శించేందుకు వచ్చిన బండి సంజయ్‌ను స్థానిక టీఆర్‌ఎస్ కార్యకర్తలు ( TRS- BJP clash in Nalgonda) అడ్డుకున్నారు. నల్లజండాలతో నిరసనలు తెలిపారు.
సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని మోహరించారు. ఈ నేపథ్యంలో.. బండి సంజయ్ మాట్లాడుతూ.. రైతుల సమస్యల కోసం ఎందాకైనా పోరాడతామని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్‌పై దాడి జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌పై దాడులు చేయమని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. బెంగాల్ తరహా రాజకీయాల్ని తెలంగాణలో సీఎం కేసీఆర్ తెర తీశారని విమర్శించారు.
సిద్దిపేట కలెక్టర్ రాజీనామా, కాసేపట్లో తెరాస లో చేరిక, ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అవకాశం
హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారన్నారు. తన ప్రలోభాలకు లొంగనందుకు హుజురాబాద్ ప్రజలపై కేసీఆర్ పగ పెంచుకున్నారని తెలిపారు. వానా కాలం పంటను ఎందుకు కొనటం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంతో ఒప్పందం ప్రకారమే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే బీజేపీ భయపడదని డీకే అరుణ స్పష్టం చేశారు.
Here's Bandi Sanjay Nalgonda Tour Updates
ఇదిలా ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ (Telangana BJP State president Bandi Sanjay) పర్యటన రణరంగంగా మారింది. ఆసాంతం టీఆర్‌ఎస్ కార్యకర్తల అడ్డగింతలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడులు.. బీజేపీ శ్రేణుల ప్రతిదాడులతో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల ఇరువర్గాలు రాస్తారోకోలకు దిగాయి. కొన్నిచోట్ల పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. దాడులు, లాఠీచార్జిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు సోమ, మంగళవారాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పర్యటిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే సంజయ్ పర్యటనను అడ్డుకుని, నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్న టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఆయా గ్రామాల్లో భారీగా మోహరించారు. ఎక్కడిక్కడ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా దీటుగా స్పందించారు. కర్రలు చేతబట్టి టీఆర్‌ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు.
నల్లగొండలో నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తామన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయని, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మొట్ట మొదటిసారిగా రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆర్‌ఎస్ భయపడుతోందన్నారు. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారని అన్నారు.
రైతుల ఇబ్బందులు ప్రశిస్తే తలలు నరుకుతావా అంటూ బీజేపీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. తమపై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా అని నిలదీశారు. కోడిగుడ్లు, రాళ్లు పడతాయని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఎలా అని అన్నారు. ఖచ్చితంగా వానాకాలం పంట మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పూనుకోవటం సరైంది కాదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన విషయాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. బీజేపీ అధ్యక్షడిపై దాడిని టీఆర్ఎస్ పార్టీ దాడిగానే చూస్తున్నామని తెలిపారు. సమస్య లేని చోట ప్రభుత్వం సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లా రైతులు పక్క రాష్ట్రంలో ధాన్యం అమ్ముకోవటం సిగ్గుచేటన్నారు. చేతకాకనే కేసీఆర్ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ పరాభవాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వాహనంపై, పలువురు నేతలపై దాడికి సంబంధించి బీజేపీ నేతలు గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మంగళవారం రాజ్‌భవన్‌లో కలిశారు. బీజేపీ నేతలు రాజాసింగ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ తదితరులు గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. నల్లగొండ ఘటనలో పోలీసుల వైఫల్యంపై గవర్నర్‌కి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. సివిల్ సప్లై కార్పోరేషన్‌కు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి ఆపుతున్నారని అనుమనం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)