![](https://test1.latestly.com/wp-content/uploads/2021/11/FotoJet-35-380x214.jpg)
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేశారు. వెంకట్రామిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన లో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం హామీ ఇవ్వడంతో పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.
ఇదిలా ఉంటే 2021, నవంబర్ 14వ తేదీ ఆదివారం సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కూడా హాజరయ్యారు. సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఇటీవలే చేసిన పలు వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామాలు సంభవించిన సంగతి తెలిసిందే. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిని విపక్షాలు క్యాష్ చేసుకుని ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించాయి