ys sharmila padayatra

Nalgonda, Nov 4: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) మానవత్వం చాటుకున్నారు. ఆమె ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ( Praja Prasthanam )చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ మర్రిగూడ సమీపంలో ఉన్న క్యాంప్‌లో బస చేస్తున్నారు. అయితే క్యాంప్‌కు సమీపంలో బైక్ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు గాయాలతో రోడ్డుపై పడిపోయారు.

ఈ విషయం షర్మిల ( YSR Telangana Party chief YS Sharmila) దృష్టికి వచ్చింది. వెంటనే స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అరగంట దాటినా అంబులెన్స్ రాకపోవడంతో.. హుటాహుటిన తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌‌ను ఘటనాస్థలికి పంపి.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఈ విధంగా క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందేలా షర్మిల తన వంతు సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 108 సేవలు ఎలా ఉన్నాయో ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుసుకోవచ్చన్నారు. అసలు 108 అంబులెన్స్ సర్వీసులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని షర్మిల మండిపడ్డారు. 108 సేవలను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు