Telangana Cabinet Meeting: తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ, జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Telangana Cabinet Meeting (Photo-TSCMO)

Hyd, August 1: సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కొత్త రేషన్‌ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  వీడియో ఇదిగో, అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అసభ్య సైగ‌లు, ముసిముసి నవ్వులు నవ్విన రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్

సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘‘గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి రూ.437 కోట్లు విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించబోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలని అంశాలను తప్పక నెరవేరుస్తాం. క్రీడాకారులు ఈషాసింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు ఒక్కొక్కరికీ 600 గజాల చొప్పున హైదరాబాద్‌లో ఇంటి స్థలం, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది.  బుజ్జగింపులు.. పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే ఇంటికి జూపల్లి, ఆసక్తికరంగా రాజకీయాలు, ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారా?

విధుల్లో చనిపోయిన రాజీవ్‌ రతన్‌ కుమారుడికి మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించాం. కోదండరాంరెడ్డి, అమీర్‌ ఖాన్‌ పేర్లను మరోసారి గవర్నర్‌కు పంపిస్తాం. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు, హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌ జంట జలాశయాలకు తరలిస్తాం’’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.

కీలక నిర్ణయాలు ఇవే..

హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి

నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగం

జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు

కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ ఆమోదం

విధివిధానాల ఖరారుకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కమిటీ.. సభ్యులుగా పొంగులేటి, దామోదర రాజనర్సింహ

రేపు సభలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ప్రభుత్వం.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయం

గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయం

మూసీలో ఎప్పటికీ ఫ్రెష్ వాటర్ ఉండేందుకు తగు నిర్ణయాలు తీసుకున్న కేబినెట్

మరోవైపు రాజీవ్ రతన్ కొడుకు హరీ రతన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం.

గౌరవెల్లి ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు‌రోడ్డు వరకూ విస్తరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం..

హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశానికి కేబినెట్ నిర్ణయం

క్రికెటర్ సిరాజ్, నిఖత్ జరిన్‌కు ఆర్థిక సాయం, గ్రూప్ 1 డీఎస్పీ పోస్టు కేటాయింపు..



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన